Donald Trump: పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చ

Donald Trump: రావణకాష్టంగా రగిలిపోతున్న ఉక్రెయిన్ భూభాగాల్లో.. శాంతి పవనాలు వీచే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో ఫోన్‌లో విడివిడిగా మంతనాలు జరిపారు ట్రంప్, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ట్రంప్.
పుతిన్‌తో ట్రంప్ సుదీర్ఘంగా ఫోన్‌లో మంతనాలు జరిపారు. ట్రంప్ తన సొంత సామాజిక మాద్యమం ట్రూత్ సోషల్‌లో వివరాలను పంచుకున్నారు. ఇక నైనా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోకుండా.. యుద్ధం ముగిసిపోవాలని ఇరువురం కోరుకున్నామన్నారు ట్రంప్. ఉక్రెయిన్ అంశంతో పాటు పశ్చిమాసియాలో అనిశ్చితి, ఇంధన రంగం, కీలక అంశాలపై పుతిన్‌తో మాట్లడానని తెలిపారు. కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. త్వరలోనే తాను రష్యాలో పర్యటిస్తానన్నారు. పుతిన్ సైతం అమెరికా పర్యటనకు వస్తారని.. ఇందుకు ఆయన అంగీరించారని చెప్పారు ట్రంప్.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోనూ ట్రంప్ మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను, చర్చల అంశాన్ని ఆయనతో ప్రస్తావించారు.