ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జీజీహెచ్‌లో కొట్టుకున్న డాక్టర్లు,నర్సులు

Nellore: నెల్లూరు జీజీహెచ్‌లో డాక్టర్లు,నర్సులు కొట్టుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్పై హౌస్ సర్జన్ దాడి చేశాడు. విధి నిర్వహణలో ఏర్పడ్డ మనస్పర్ధలతో స్టాఫ్ నర్స్ వెంకట్‌పై హౌస్ సర్జన్ దాడికి పాల్పడ్డాడు.
దాడికి నిరసనగా జీజీహెచ్ ఎదుట స్టాఫ్ నర్సుల ఆందోళనకు దిగారు. హౌస్ సర్జన్‌పై దుర్గామిట్ట పీఎస్‌లో స్టాఫ్ నర్సులు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. దాడి ఘటనపై అధికారులు ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.



