తెలంగాణ
Hanamkonda: ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ఆఫీసులో నేతల గృహ నిర్బంధం

Hanamkonda: హనుమకొండలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో.. పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లనీయకుండా బీఆర్‌ఎస్ కార్యాలయంలో.. పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యాలయం చుట్టూ భారీగా మోహరించారు.