సినిమా

దీపికా కోట్ల వ్యూస్.. సోషల్ మీడియాలో సంచలనం!

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో రికార్డు సృష్టించింది. ఆమె షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ అనూహ్యంగా 190 కోట్ల వ్యూస్ సాధించింది. ఈ ఘనతతో అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు. ఈ రికార్డు విశేషాలు తెలుసుకుందాం!

దీపికా పదుకొనే సోషల్ మీడియాలో అసాధారణ రికార్డు నెలకొల్పింది. హిల్టన్ హోటల్ యాడ్ కోసం ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ 190 కోట్ల వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 8 వారాల్లో ఈ ఘనత సాధించిన దీపికా, హార్దిక్ పాండ్య, రొనాల్డోల రికార్డులను అధిగమించింది.

80 మిలియన్ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలిచిన ఆమె, ఈ విజయంతో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాల్లోనూ దీపికా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంటోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button