తెలంగాణ
Telangana: తెలంగాణలో చలి తీవ్రత.. వణికిపోతున్న జనం..

Telangana: తెలంగాణలో చలి తీవ్రత. చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం ఐదుగంటల నుంచి చలిగాలులు ప్రారంభమవుతున్నాయి. ఉదయం పది గంటల వరకూ చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో చలిగాలుల తీవ్రతఎక్కువగా ఉంది. ఉదయం బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు.