తెలంగాణ

Egg Rates: గుడ్డు ప్రియులకు గడ్డు కాలం..

Egg Rates: గుడ్డు ప్రియులకు గడ్డు కాలం వచ్చింది. గుడ్డు ధర మార్కెట్లో ఏడు రూపాయలు పలుకుతుంది. రాబోయే నూతన సంవత్సరం, సంక్రాంతి, వివిధ రకాల పండుగలకు కేకులలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇదే అదునుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పౌల్ట్రీ ఫార్మర్స్ తెలిపారు. మార్కెట్లో గుడ్డు ధర పెరగడంతో వినియోగదారుడికి భారంగా మారింది.

శీతాకాలంలో వచ్చే గుడ్లను నిల్వ చేసి వేసవి కాలంలో అమ్మకాలు జరుపుతారని ఆరోపణలున్నాయి. కొండెక్కిన ధరతో కోడిగుడ్డు దూరమైపోయింది. ప్రభుత్వం దృష్టిపెట్టి కోడిగుడ్డు ధర తగ్గించేలా చూడాలని గుడ్డు ప్రియులు, ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button