తెలంగాణ
Hyderabad: విషాదం.. స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి

Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.
శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో చిన్నారి రిత్విక.. LKG చదువుతోంది. స్కూల్ బస్సు దిగి వెళ్లున్న క్రమంలో.. బస్సును డ్రైవర్ రివర్స్ చేశాడు. దీంతో.. కిందపడిపోయిన చిన్నారి తలపై నుంచి బస్సు వెళ్లింది. అక్కడికక్కడే రిత్విక మృతిచెందింది.