Vishwambhara: విశ్వంభర సంచలనం.. రూ.75 కోట్లతో వీఎఫ్ఎక్స్ మాయాజాలం

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ సినీ ప్రియుల్లో అంచనాలు రెట్టింపు చేస్తోంది. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సినిమా తాజా అప్డేట్ సినీ సర్కిల్స్‌లో సంచలనం రేపుతోంది. మరి, ఆ స్పెషల్ అప్డేట్ ఏంటో చూద్దాం!
‘విశ్వంభర’ చిత్రం కోసం చిత్ర యూనిట్ ఏ ఒక్క అంశంలోనూ రాజీపడటం లేదు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం మాత్రమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్‌తో వీఎఫ్ఎక్స్ స్థాయి హాలీవుడ్‌ను తలపించనుందని అభిమానులు ఉహాగానాలు చేస్తున్నారు. చిరంజీవితో పాటు త్రిష, అషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం సినిమాకి మరో హైలైట్. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై భారీగా నిర్మితమవుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆకట్టుకున్న ‘విశ్వంభర’బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.