ఆంధ్ర ప్రదేశ్
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్

Posani Krishna Murali: వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు.
రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు.