సినిమా

Jr NTR: తారక్ పై హృతిక్ గూస్ బంప్స్ కామెంట్స్

Jr NTR: ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ అంటే ‘వార్ 2’ అని చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలయికలో ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నార్త్ నుంచి సౌత్ వరకు సంచలన హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.

తాజాగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో తన ఫేవరెట్ కో-స్టార్ ఎవరని అడిగితే, హృతిక్ వెంటనే ‘జూనియర్ ఎన్టీఆర్’ అని సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్‌లో ఎందరో స్టార్స్‌తో కలిసి పనిచేసిన హృతిక్, ఎన్టీఆర్‌ను ప్రశంసించడం విశేషం. ‘వార్ 2’ షూటింగ్‌లో ఎన్టీఆర్ తన టాలెంట్‌తో తనను మెస్మరైజ్ చేశాడని, అతను ఫైనెస్ట్ కో-స్టార్ అని హృతిక్ చెప్పడం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బూస్ట్ ఇచ్చింది.

ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అంతేకాదు, ‘వార్ 2’ ఆగస్ట్ 14 న రిలీజ్ అవుతుందని హృతిక్ కన్ఫర్మ్ చేయడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నార్త్-సౌత్ సినిమా అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button