USA-China: అమెరికా-చైనా మధ్య సుంకాల యుద్ధం

USA-China: అమెరికా-చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. చైనా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతానికి పెంచినట్లు ఇటీవల ప్రకటించారు. అయితే గతంలో ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి విధించిన 20శాతం సుంకాలకు అదనమని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ తాజాగా వెల్లడించింది. దీంతో చైనాపై సుంకాలు 145శాతానికి చేరుకున్నాయని స్పష్టం చేసింది.
చైనా దిగుమతులపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. అమెరికా చర్యలకు దీటుగా స్పందిస్తున్న చైనా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాపై విధించిన సుంకాలు మొత్తంగా 145శాతానికి చేరుకున్నట్లు వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.