తెలంగాణ
TG Assembly: అసెంబ్లీలో పల్లా వర్సెస్ పొన్నం

TG Assembly: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు పల్లా. ఏ గ్రామానికైనా వెలితే కరెంట్ లేదనో, నీళ్లవ్వలేదనో చెబుతారు కానీ మహిళా జర్నలిస్ట్ పై ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కేసు పెట్టిన దాఖలాలు లేవని పల్లా ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ పైర్ అయ్యారు. మహిళా జర్నలిస్ట్ పెట్టిన వీడియోను చూశాక పల్లా మాట్లాడాలన్నారు పొన్నం. ఆ వీడియోను పల్లా రాజేశ్వర్ రెడ్డి సమర్ధిస్తే అలాంటి వీడియో ఆయనకు వెంటనే రెడీ అవుతుందన్నారు. పల్లా ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారని పొన్నం అన్నారు. కాంగ్రెస్కు ఏం అనుభవం కావాలి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ సొంత పత్రికలు, టీవీలు పెట్టుకోలేదని విమర్శించారు పొన్నం.