జాతియం
Thalapathy Vijay: రాబోయే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తాం.. విజయ్ సంచలన వ్యాఖ్యలు

Thalapathy Vijay: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొంది తమిళ రాజకీయాల్లో చరిత్రను తిరగరాస్తామని తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాబలిపురంలో నిర్వహించిన టీవీకే పార్టీ మహానాడు ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో 2026లో రాబోయే సాధారణ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసిన గెలుపు తమదేనని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. పెత్తందార్లు, భూస్వాములు వాళ్ల స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆరాచకాలు చేస్తున్నారని విజయ్ మండిపడ్డారు.