అంతర్జాతీయం

Grammy Awards: అమెరికా మాజీ అధ్యక్షుడికి గ్రామీ అవార్డు

Grammy Awards: సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇక ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు గ్రామీ పురస్కారం వరించింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ ‌ గతేడాది డిసెంబర్‌ 30న కన్నుమూశారు. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఆయన రచించిన ది లాస్ట్‌ సండేస్‌ ఇన్‌ ప్లేన్స్‌కు బెస్ట్‌ ఆడియోబుక్‌ నెరేషన్‌ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్‌ కార్టర్‌ అందుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button