సినిమా

Pooja Hegde: శ్రీకాళహస్తీలో పూజా హెగ్డే ప్రత్యేక పూజాలు

Pooja Hegde: పూజా హెగ్డే ఈ పేరుకు తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అగ్ర హీరోల సరసన నటిస్తూ ఓ వెలుగు వెలిగిన ఆమెకు ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గాయి.

రెండున్నరేళ్లుగా టాలీవుడ్‌లో కనిపించని పూజా, దక్షిణాది సినిమాల్లోనూ కనుమరుగైందనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆమె గట్టిగా కం బ్యాక్ ఇస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘రెట్రో’లో హీరోయిన్‌గా, రజనీకాంత్ ‘కూలీ’లో స్పెషల్ సాంగ్‌తో, రాఘవ లారెన్స్ ‘కాంచన 4’లో కీలక పాత్రలో కనిపించనుంది. హిందీలోనూ ఓ సినిమా చేస్తూ బిజీ అవుతోంది. అవకాశాలు వచ్చినా విజయం సాధిస్తాయా అనేది వేచి చూడాలి.ఇదిలా ఉంటే, కెరీర్ ఉద్ధరణ కోసం పూజా ఆధ్యాత్మిక మార్గం పట్టింది.

తాజాగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె, స్వామి-అమ్మవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. దర్శనం తర్వాత వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించి, ఆశీర్వచనాలు అందించారు. ప్రస్తుతం ఈ దర్శన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూజా కం బ్యాక్ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది మున్ముందు చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button