ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఏపీ సీఎం చంద్రబాబు తీరు

YS Sharmila: సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు షర్మిల. ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుందని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో… అభివృద్ధికే దిక్కులేదని విమర్శించారు. పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట.. అందులో అద్భుత ప్రపంచం కడతాడట.. అన్నారు.
అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుకే తెలిసిన విద్య అంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదన్నారు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదు అని షర్మిల విమర్శించారు.