టాలీవుడ్
Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి సంచలన ట్వీట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని.. ఎన్నిసార్లు మా అసోసియేషన్‌కు కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదని ట్వీట్లో పేర్కొన్నారు. పూనమ్ కౌర్ ట్వీట్‌పై మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ ట్వీట్‌పై మా కోశాధికారి శివబాలాజీ క్లారిటీ ఇచ్చారు.
పూనమ్ కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివబాలాజీ తెలిపారు. తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డుల్లో లేదన్నారు. పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం వల్ల ఉపయోగం లేదన్న శివబాలాజీ.. మా అసోసియేషన్‌ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందన్నారు.