సినిమా
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం

Saif Ali Khan: నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుడిని ముంబై పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం.. నిందితుడికి కస్టడీ విధించింది. 29వ తేదీ వరకు పోలీసుల కస్టడీకి అనుమతించింది.
మరోవైపు తన దాడిపై సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలాన్ని అందించారు. నిద్రపోతున్న సమయంలో నర్సు అరుపులు వినిపించాయని నటుడు చెప్పినట్లు సమాచారం. దీంతో తాను కిందకు వచ్చినట్లు సైఫ్ వెల్లడించారు. అయితే అక్కడే దుండగుడిని చూసినట్లు సైఫప్ అలీఖాన్ స్టేట్‌మెంట్ లో తెలిపాడు.