సినిమా

The Raja Saab: రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?

The Raja Saab: ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, రెండు పాటలు మంచి రెస్పాన్స్ పొందాయి. ప్రమోషన్స్ వేగం పెంచిన మేకర్స్ హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, రెండు పాటలు అద్భుత రెస్పాన్స్ పొందాయి. రిలీజ్ సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషనల్ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. ఈవెంట్ డిసెంబర్ 27న జరగనుందని సమాచారం. వేదిక ఇంకా ఖరారు కాలేదు.

అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. ఈ ఈవెంట్‌లో మరో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ట్రైలర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. రెండో ట్రైలర్ మరింత హైప్ పెంచేలా రూపొందుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button