తెలంగాణ
హైదరాబాద్ పాతబస్తీలో పొంగిన నాళాలు, డ్రైనేజీలు

హైదరాబాద్ పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి నాళాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితా బాగ్ డివిజన్లలోని పలు కాలనీలలో మోకాళ్ళలోతు వరద నీరు చేరింది.
స్థానిక ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు పాదచారులు కదలలేని పరిస్థితి నెలకొంది. జిహెచ్ఎంసి. హైడ్రా. జలమండలి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.



