కల్యాణి బాలీవుడ్ ఎంట్రీ!

Kalyani Priyadarshan: మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. రణవీర్ సింగ్ సరసన జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ప్రలే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రంతో హిందీ ప్రేక్షకులను ఆకర్షించనుంది. అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
లోకా బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. రణవీర్ సింగ్ హీరోగా జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కే ప్రలే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇది జాంబీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో భారీ నిర్మాణం జరుగుతోంది. రణవీర్ సింగ్ స్వయంగా తన మా కసమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
గతేడాది లోకతో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన కల్యాణి ఇప్పుడు హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం రణవీర్ ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తోంది. దాని సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. ఆ తర్వాత ప్రలే షూటింగ్ ప్రారంభమవుతుందట.



