తెలంగాణ
Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జున సాగర్.. 26 గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 26క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జల విద్యుత్ కేంద్రంలో పవర్ ఉత్పత్తిని అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ప్లో దాదాపు సమానంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 294 టీఎంసీలుగా ఉంది.



