తెలంగాణ

Revanth Reddy: ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ఉంది

Revanth Reddy: రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. అనంతరం ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి సత్కరించారు. తెలంగాణ పాడి పంటలతో కళకళలాడాలని సీఎం ఆకాంక్షించారు.

ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీఠ వేశామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామన్నారు. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button