సినిమా
GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

GHMC: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు షాక్ తగిలింది. లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించారని రెండు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్స్‌లు ఎగవేసినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లక్షా 92 వేల చ.అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8 వేల 100 చదరపు అడుగులకు ట్యాక్స్ కడుతున్నారు.
11 లక్షల 52 వేల రూపాయలకు బదులు 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక 68 వేల చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తున్న రామానాయుడు స్టూడియోస్ 19 వందల చదరపు అడుగులకే ట్యాక్స్ కడుతోంది. 2 లక్ష 73 వేలకు బదులు 7 వేల 600 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.



