సినిమా

HIT 3: హిట్ 3 ట్రైలర్ టాక్: అదుర్స్

HIT 3: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’ కోసం అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమైంది.

తాజాగా విడుదలైన ‘హిట్-3’ ట్రైలర్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. 3 నిమిషాల 32 సెకన్ల నిడివితో ఉత్కంఠభరితంగా సాగే ఈ ట్రైలర్, ప్రతి షాట్‌తో ఆకట్టుకుంటోంది. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, క్రూరమైన విజువల్స్, రక్తసిక్త దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం విజువల్స్‌కు జీవం పోసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. మే 1న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను అలరించేందుకు రెడీ అయింది. ‘హిట్’ సిరీస్‌లో మూడో భాగమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button