తెలంగాణ
Raghunandan: నెక్స్ట్ సీఎం సీటులో కూర్చుంటాం.. రేవంత్‌రెడ్డికి కౌంటర్

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజిగిరిని గెలిచామన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో కాషాయ జెండాను ఎగరవేశామన్నారు. రేవంత్ ఇంచార్జ్‌గా ఉన్న చేవెళ్లలో బీజేపీ గెలిచిందన్నారు.
కామారెడ్డిలో ఇద్దరు సీఎంలను ఓడించామన్నారు. మీ కంటే ముందున్న సీఎం ఇలాకాలో మెదక్ ఎంపీగా గెలిచానన్నారు. నెక్స్ట్ సీఎం సీటులో కూర్చుంటామని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రేవంత్ ఇంకా నీవు మమ్మల్ని అడ్డుకునేది ఏంటని ఆయన ప్రశ్నించారు.