సినిమా

Samantha: ఉత్తమ ఓటిటి నటిగా సమంతకు అవార్డ్

Samantha: స్టార్ బ్యూటీ సమంత సిటాడెల్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. సిటాడెల్- హనీ బన్నీలో సూపర్ స్టంట్స్ తో అదరగొట్టేసింది. ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా సమంతకి మాత్రం మంచి పేరు వచ్చింది. సమంత నటన, యాక్షన్ సీన్స్ కి ప్రజల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒరిజినల్ లో ప్రియాంక చోప్రా నటన కంటే, ఇండియన్ వెర్షన్ రీమేక్ లో సమంత నటనకు ఎక్కువ గుర్తింపు దక్కింది.

తాజాగా ‘సిటాడెల్: హనీ బన్నీ’లో తన నటనకు సమంత రూత్ ప్రభు న్యూస్18 షోషా రీల్ అవార్డ్స్ 2025 ఉత్తమ నటిగా ఓటీటీ అవార్డును గెలుచుకుంది. రాజ్& డికె దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ కూడా ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

తన హార్డ్ వర్క్ కి తగిన గుర్తింపు లభించడంతో సమంత చాలా ఆనందపడింది.హీరామండి సినిమాలో నటించిన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీరావ్ కూడా ఉత్తమ నటి అవార్డ్` కోసం పోటీపడ్డారు. కానీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ మాత్రం సమంతను వరించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button