తెలంగాణ

SLBC Tunnel: SLBC టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారుల సమీక్ష

SLBC Tunnel: SLBC టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలను అధికారులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు.

సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని అధికారులు ఆదేశించారు. మృతుడు గురుప్రీత్ సింగ్‌ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారని డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ సీఎస్ అరవింద్ కుమార్ తెలియజేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పని చేయడానికి అవసరమైన వసతులను అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button