తెలంగాణ
ఏపీ కోళ్లపై బ్యాన్… తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు. ఆంధ్రా నుంచి కోళ్లను తెలంగాణకు అనుమతించవద్దని ఉత్తర్వుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు.
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రవాణా శాఖ తనిఖీ కేంద్రం దగ్గర.. కోళ్ల వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపారు. వైరస్ పూర్తిగా నశించిన అనంతరం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.