తెలంగాణ

Raj Gopal Reddy: కాంగ్రెస్‌లో బయటి నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైంది..!

Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్‌లో బయటి నుంచి వచ్చిన వారి పెత్తనం ఎక్కువైందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణచివేయొద్దని.. ఉద్యమకారులకు పార్టీలో తగిన గుర్తింపు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పుచేతుల్లో ఉండకూడదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి తప్ప.. కాంట్రాక్టర్ల కోసం కాదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి వరుస వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button