తెలంగాణ
నేడు, రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి

నేడు, రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష జరపనున్నారు. రెండు హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు నిర్వహించనున్నారు. సోమశిలలో నేడు సీఎం కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాత్రికి సోమశిలలో సీఎం రేవంత్ బస చేయనున్నారు. రేపు ఉద్దండాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు.



