వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ అప్డేట్?

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మళ్లీ ఒకసారి థియేటర్లలో రచ్చ చేయబోతోంది. జులై నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.
వెంకటేష్, అనిల్ రావిపూడి జోడీ హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో మళ్లీ రాబోతుంది. ఈ భారీ ఎంటర్టైనర్ జులై నుంచి పట్టాలెక్కనుంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. పుష్ప తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఫహద్, వెంకటేష్‌తో కలిసి హాస్యం, ఎమోషన్ సన్నివేశాలతో మెప్పించనున్నారు.
హీరోయిన్లుగా కీర్తి సురేష్, పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాలి. అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్‌తో ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్‌తో ఆదర్శ కుటుంబం పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.



