Parasakthi: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న క్రేజీ సినిమా?

Parasakthi: శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అయితే తెలుగు వెర్షన్‌పై మాత్రం సందిగ్ధం నెలకొంది. భారీ చిత్రాల పోటీ మధ్య వాయిదా వేయవచ్చని టాక్. మేకర్స్ ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారు. సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, విజయ్ ‘జన నాయకుడు’ వంటి భారీ చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. ఇన్ని సినిమాల మధ్య పోటీకి దిగితే అనుకున్న రీచ్ రాకపోవచ్చనే ఆందోళన మేకర్స్‌లో ఉంది. తెలుగు వెర్షన్‌ను వాయిదా వేస్తే మంచిదని అంటున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదు.



