తెలంగాణ
Hyderabad: హాస్పటల్లో డ్రగ్స్ కలకలం

Hyderabad: హైదరాబాద్ పరిధిలోని ఎస్ఆర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఆస్పత్రిలో కేఫిటేరియా మేనేజర్ వద్ద డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మేనేజర్ ఆసిఫ్ వద్ద ఎమ్డీఎమ్ఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
గత కొంతకాలంగా ఆసిఫ్ వ్యక్తిగతంగానే డ్రగ్స్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి సేవిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. అయితే ఎమ్డీఎమ్ఏ డ్రగ్ ఎవరి ద్వారా ఆసిఫ్‌కు సరఫరా అవుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.



