సినిమా

Renu Desai: ధురంధర్‌పై రేణు దేశాయ్ వైరల్ కామెంట్స్?

Renu Desai: రణ్‌వీర్‌ సింగ్‌ ధురంధర్ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాపై తెలుగు నటి రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి భారతీయుడూ తప్పక చూడాలని సూచించారు. సైన్యం త్యాగాలను గుర్తుచేశారు. ఇంకా ఏమన్నారో పూర్తి వివరాలు చూద్దాం.

రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ధురంధర్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కి దేశవ్యాప్తంగా భారీ చర్చనీయాంశంగా మారింది. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం భారత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో స్పందించారు. దర్శకుడు ఆదిత్య ధర అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రతి భారతీయుడూ తప్పక చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు.

మనల్ని కాపాడేందుకు భారత సైన్యం, రక్షణ దళాలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయని, వారి త్యాగాల వల్లే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని గుర్తుచేశారు. ఇకనైనా దేశ వ్యతిరేక ధోరణులు మానుకొని, అందరూ దేశం పక్షాన నిలబడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి భారీ స్పందన పొందుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button