తెలంగాణ
IBOMMA Ravi: మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి

IBOMMA Ravi: ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా మూడు కేసుల్లో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం చంచల్గూడ జైలు ఉన్న ఐబొమ్మ రవిని శనివారం, సోమవారం, మంగళవారం కస్టడీ విచారణకు తీసుకొని పోలీసులు విచారించనున్నారు.



