సినిమా
అఖండ 2 సినిమా రేట్ల పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం

అఖండ 2 సినిమా రేట్ల పెంపుపై సీపీఐ నాయకుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీమియర్లకు 600, థియేటర్లలో అదనంగా 75 నుంచి 100 పెంపు అనుమతించడం ప్రజలపై భారం మోపుతున్న చర్య అని ఆయన విమర్శించారు. ఇలాంటి రేట్లతోనే ఐబొమ్మ రవి లాంటి వారిని సృష్టిస్తున్నారన్నారు.
ఐ బొమ్మ రవి లాంటి వారు అనేక మంది పుట్టుకొస్తారని అలాంటి వారిని అరెస్టు చేసే నైతిక హక్కు పోలీసులకు లేదన్నారు నారాయణ. వందల కోట్లు పెట్టి సినిమాలు చేసి ప్రజల జేబులకు తూటాలు పొడవడం సరికాదని, సంక్రాంతి సినిమాలకూ ఇదే ధోరణి కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.



