సినిమా
Akhanda 2: 2 లక్షలు పలికిన అఖండ-2 టికెట్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ ‘అఖండ-2’ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్లో అపూర్వ క్రేజ్ నెలకొంది. జర్మనీలో ఒక టికెట్‌ను ఏకంగా రూ.2 లక్షలకు ఓ అభిమాని దక్కించుకున్నాడు. ఈ ఘటన సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్, ‘జాజికాయ,’ ‘తాండవం’ పాటలు భారీ వ్యూస్ సాధించాయి. ఇదిలా ఉండగా, జర్మనీలో అఖండ 2 టికెట్‌ను వేలం వేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా రూ.2 లక్షలు బిడ్ వేసి దక్కించుకున్నాడు. ఇది భారతీయ సీనియర్ హీరోల సినిమాలకు ఓవర్సీస్లో ఇప్పటివరకు లభించిన అత్యధిక టికెట్ ధరగా నమోదైంది. ఈ సంఘటన బాలయ్య క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.



