తెలంగాణ
హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ అరెస్ట్… గన్‌మన్లతో, సైరన్‌తో భారీ మోసాలు

హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ గుట్టు రట్టైంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారినంటూ నమ్మించి, ఇద్దరు గన్‌మెన్లను కూడా నియమించుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనానికి సైరన్ బిగించుకుని, వాకీటాకీలతో హల్‌చల్ చేస్తూ రెండేళ్లుగా అమాయకులను మోసం చేస్తున్న శశికాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అలీ హసన్ అనే వ్యక్తికి పారిశ్రామిక భూమి ఇప్పిస్తానని, ఇతర అధికారిక పనుల్లో సాయం చేస్తానని నమ్మించి 10.50 లక్షలు వసూలు చేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత పరారీ కావడంతో బాధితుడు ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షేక్‌పేటలోని నిందితుడి నివాసంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.



