ఆంధ్ర ప్రదేశ్
YCP Protest: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన

YCP Protest: ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరు బాట నిర్వహించింది. మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మండల కేంద్రాల్లో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.



