తెలంగాణ

Ibrahimpatnam: బైక్‌ను తప్పించబోయి బోల్తా కొట్టిన కారు

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న బైక్‌ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా కొట్టగా ఆ వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఎక్కింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడడంతో కారు అద్దాలు ధ్వంసం కాగా ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button