తెలంగాణ

Sridhar Babu: ఆస్ట్రేలియాలోని ఒరికా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీ

Sridhar Babu: దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ ఆస్ట్రేలియా దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మెల్‌బోర్న్‌లోని ఒరికా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలాపాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ‘ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలమని పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉందని కంపెనీ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని వారిని ఆహ్వానించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button