ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో యూరియా కష్టాలు

ఉయ్యూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న రైతులకు యూరియా లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల గా యూరియా కోసం తిరుగుతుంటే అరకొర ఎరువులు అంటగట్టి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులకు టన్నుల్లో యూరియా ఇస్తున్నారని, సామాన్యులకు స్టాక్ లేదని చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.



