తెలంగాణ
Kadem Project: కడెం ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తివేత

Kadem Project: కడెం ప్రాజెక్టుకు భారీ వరద చేరుతుండటంతో 17 వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 693.700 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 4.699 టి ఎం సిలకు ప్రస్తుత నీటి మట్టం 3.224 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 86,996 క్యూసెక్కులుగా ఉంది.
ప్రాజెక్టు గేట్లను 12 ఫీట్లు ఎత్తి లక్షా పన్నెండువేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దిగువ ప్రాంత గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.



