తెలంగాణ
కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. రెండు గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద వస్తుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 690 అడుగులు కొనసాగుతుంది.
ప్రాజెక్టు సామర్థ్యం 4. 6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 3. 9 టీఎంసీలు కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 4812 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 12833 క్యూసెక్కులు కొనసాగుతుంది. దిగువ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు.



