పూర్తి స్లిమ్‌గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్

NTR: జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా చేంజ్ అయ్యారు. పూర్తి స్లిమ్‌గా మారిపోయారు జూనియర్. వార్ 2 ప్రీ రిలీజ్ సందర్భంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు ఎన్టీఆర్. ఈవెంట్లో జూనియర్ అభిమానులు ఉత్సాహంగా కన్పించారు. అభిమానులను కట్టిడి చేయడానికి నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు. చాన్నాళ్ల తర్వాత వేదికపై జూనియర్ కనిపించడంతో చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.
కార్యక్రమంలో కేకలతో అభిమానులు హోరెత్తించారు. అభిమానులను కట్టడి చేసేందుకు జూనియర్ ప్రయత్నించారు. సైలెంట్‌గా లేకుంటే మైక్ వదిలేసి వెళ్లిపోతానన్నారు. ఈవెంట్లో గతానికి భిన్నంగా మాట్లాడారు జూనియర్.
మనకంటే గొప్పవాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లందరినీ గౌరవించాలంటూ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమా వార్2 లో హృతిక్ రోషన్‌తో కలిసి జూనియర్ నటించడంపై అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఈవెంట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆనందానికి కారకులయ్యారంటూ వీడియోలో చెప్పారు జూనియర్.



