తెలంగాణ
Christmas Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు..

Christmas Celebrations: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్ధీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పండగవేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు యేసు నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మెదక్ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి.
తెల్లవారుజామున ప్రాతకాల ఆరాధనతో వేడుకలు షురూ అయ్యాయి. శతాబ్ది వేడుకల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుద్ధీపాలతో చర్చి ప్రాకారాలను, టవర్ ను అందంగా ముస్తాబు చేశారు.