సినిమా

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Black Night: శ్లోక ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటేశ్వర రావు నిర్మాతగా సతీష్ కుమార్ రచనా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బ్లాక్ నైట్. ఈ చిత్రానికి మధు కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా విజయ్ బొల్లా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్షయ్, మదన్ తదితరులు కీలకపాత్ర పోషించారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ ను చిత్ర పరిశ్రమ పెద్దలు లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆల్ ద బెస్ట్. ఈ మధ్యకాలంలో దైవానికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరోసారి వింటేజ్ రోజుల తరహా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ తరానికి తగ్గట్లు మరోసారి అటువంటి సినిమాలను తీసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

పితాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… “ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ లాంచ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇటీవల కాలంలో ఇటువంటి దైవాత్మక సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. చిత్ర సాంగ్స్, టైలర్ ఎంతో బాగున్నాయి. చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చే వారిని మనం ప్రోత్సహించి అండగా నిలబడాలి. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు విజయ్ బొల్లా మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో చేసేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో ఛాలెంజింగ్ తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. సాధారణంగా ఇటువంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ సినిమా కోసం మా దర్శకుడు నా వెంట ఉండి చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాలుగు పాటలు రాసి అందించిన మా నిర్మాతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటుడు ఆకాష్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా గురించి ముందుగా నిర్మాతకు నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి చాలా థాంక్స్. నాతోపాటు నటించడం మధన్, ఇంకా ఇతర నటీనటులు నాకు ఎంతో సపోర్టుగా నిలిచారు. ఈ సినిమాకు విజయ్ బొల్లా గారి సంగీతం ఎంతో బలాన్ని చేకూర్చింది. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు మదన్ మాట్లాడుతూ… “ఈ సినిమాకు సపోర్ట్ గా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన వారంతా కొత్త వారిమే. కొత్త వారంతా ఓ చిన్న సినిమా తీసి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది ఎంతో గొప్ప విషయం. చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాకు డైరెక్టర్ పై ఎంత నమ్మకం ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఈ చిత్రానికి ఎంతో బలాన్ని చేకూర్చింది. సినిమాని పెద్ద విజయం సాధించేందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ సినిమా చేసేందుకు నిర్మాత వెంకటేశ్వరరావు గారు అడిగినంత బడ్జెట్ ఇచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత సపోర్ట్ ఇచ్చారు. అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర నిర్మాత వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను సాధారణంగా రైటింగ్ చేస్తూ ఉంటాను. అటువంటిది తొలిసారి అనుకోకుండా నిర్మాతగా మీ ముందుకు వచ్చాను. సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన పెద్దలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకులు, నటులు ఆకాష్, మధన్ నా స్టూడెంట్స్. ఈ సినిమా అంతా రియల్ లొకేషన్ లో షూటింగ్ చేయడం జరిగింది. అలాగే యువత కోసం e ఈ సినిమాలో మంచి పబ్ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ సినిమాని అందరూ అభిమానించి మంచి విజయాన్ని అందజేస్తారని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button