తెలంగాణ
హైడ్రా తీరుపై MLA అరెకపూడి గాంధీ ఫైర్

Arekapudi Gandhi: హైడ్రా తీరుపై MLA అరెకపూడి గాంధీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా హైడ్రా తీరు ఉందంటూ మండిపడ్డారు. చెరువులు కబ్జా కాకుండా అభివృద్ధిచేయాలని సీఎం రేవంత్‌ది ఆలోచన అని గుర్తుచేశారు.
కానీ హైడ్రా అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నంచెరువులో FTL బఫర్జోన్లు నిర్ధారించకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు అరెకపూడి గాంధీ. ఘటనపై సీఎం రేవంత్‌ను తొందరిలోనే కలుస్తానని చెప్పారు.