అంతర్జాతీయం

Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. 12 మంది మృతి

Mexico: మెక్సికో మరోసారి కాల్పులతో అట్టుడికింది. గ్వానాజువాటలోని ఇరాపువాటో నగరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంద్రి ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.

కొందరు ఓ స్ట్రీట్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా డ్రమ్స్ వాయిస్తూ డ్యాన్స్‌ చేస్తూ ఉండగా గుర్తు తెలియని దుండగుడు అక్కడికి వచ్చి వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనను మెక్సికన్‌ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

కాగా గత నెలలోనూ గ్వానాజువాటోలోని శాన్‌ బార్టోలో డి బెర్రియోస్లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా దుండగులు రెచ్చిపోయి కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ నగరంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ ప్రాంతంలో జరిగిన ఘటనల్లో వెయ్యిమందికి పైగా మృతి చెందారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button